Home తాజా వార్తలు తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణలో భారీ వర్షాలు

Rainsహైదరాబాద్: తెలంగాణలో రానున్న రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే సెప్టెంబర్‌ 2న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని సూచించింది. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కేంద్ర వాతవరణ అధికారులు తెలిపారు. సోమవారం వినాయక చవిత సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో వర్షం కురిస్తే నిర్వాహకుల నిరాశే మిగులుతుంది. గడిచిన రెండు రోజులు పగటి ఉష్ణోగ్రతలు రెండు నుండి మూడు డిగ్రీలు అధికంగా ఉండి, సాయంత్రానికి పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.

Heavy rains in Telangana for the next two days