Home తాజా వార్తలు రాష్ట్రంలో మరో మూడ్రోజులు వర్షాలు

రాష్ట్రంలో మరో మూడ్రోజులు వర్షాలు

Heavy Rains in Telangana Next Three Days

హైదరాబాద్: తూర్పు మధ్య అరేబియా, ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతాంల్లో తీవ్ర అప్పపీడనం ఏర్పడింది. తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం 8:30గంటలకు వాయుగుండంగా మారింది. రాగల 48గంటల్లో వాయుగుండం పశ్చిమ దిశగా పయనించి బలహీనపడే అవకాశముంది. దక్షిణ ఎపి తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కి.మీ ఎత్తులో ఉపరిత ఆవర్తనం కొనసాగునుంది. దీంతో మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 19న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.

Heavy Rains in Telangana Next Three Days