Home Default తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణలో భారీ వర్షాలు

Heavy Rains In Telangana Stateహైద‌రాబాద్ : తెలంగాణలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  ప‌శ్చిమ మ‌ధ్య‌, వాయ‌వ్య బంగాళాఖాతంలో, ఉత్త‌రాంధ్ర‌, ద‌క్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడ‌నం ఏర్ప‌డిందని వారు పేర్కొన్నారు. తూర్పు, ప‌శ్చిమ భార‌త ప్రాంతాల మ‌ధ్య గాలుల‌తో ఉప‌రిత‌ల ద్రోణి కూడా ఏర్ప‌డిందని, దీంతో  సోమ,మంగళవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వారు వెల్లడించారు. అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో రాష్ర్టంలో  విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వారు తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో   భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం కూడా ఉందని వారు చెప్పారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.