Friday, April 26, 2024

హైదరాబాద్ లో కుండపోత వర్షం

- Advertisement -
- Advertisement -

Heavy rains to continue in Telangana

హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులకు ఇక్కట్లు ఏర్పడ్డాయి. దీంతో హైదరాబాద్ లో డిజాస్టర్ బృందాలు అప్రమత్తమైయ్యాయి. ఎల్ బినగర్, హయత్ నగర్, వనస్థలిపురంలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు, నాలాల ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్లను అప్రమత్తం చేసింది. అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులంతా హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు.  అల్పపీడనం బలహీనపడడంతో రాగల 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Heavy rains to continue in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News