Home తాజా వార్తలు సిఎం క్యాంప్ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు

సిఎం క్యాంప్ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు

FINAL1హైదరాబాద్: నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికుల ‘చలో సిఎం క్యాంప్ ఆఫీస్’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, నిమ్స్ వద్ద భారీగా పోలీసు బలగాలను మొహరించారు. కాంట్రాక్ట్ కార్మికులు భారీ ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.