Friday, April 19, 2024

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి..

- Advertisement -
- Advertisement -

Heavy water flow to Srisailam Project

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,03,864 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 66,534 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు కాగా, ప్రస్తుతం 882.50 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 208.2841 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో  విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది. ఈ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది.

Heavy water flow to Srisailam Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News