Wednesday, April 17, 2024

కృష్ణా నదిలో వరద ఉధృతి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఎగువన భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదిలో వరద‌ ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ పరిసరాలలో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.07 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ముంపు గురి కాబోయే ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని, కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లుతుండడంతో దాటే  ప్రయత్నం చేయరాదని అధికారులు హెచ్చరించారు.

శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జలాశయం 10 గేట్లు15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3,85,530 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో  4,43,293 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులుకాగా ప్రస్తుతం 884.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టిఎంసిలుగా ఉండగా ప్రస్తుతం 213.4011 టిఎంసిలుగా ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News