Wednesday, April 24, 2024

సముద్రాలను తలపిస్తున్న మేడిగడ్డ, అన్నారం జలాశయాలు

- Advertisement -
- Advertisement -

సముద్రాలను తలపిస్తున్న మేడిగడ్డ, అన్నారం జలాశయాలు
కొనసాగుతున్న మేడిగడ్డ గేట్ల ఎత్తివేత
ప్రాజెక్టుల్లోకి భారిగా వరదనీరు
ప్రతినీటి చుక్కను ఒడిసిపడుతున్న ప్రాజెక్టులు

మనతెలంగాణ/హైదరాబాద్/భూపాలపల్లి: కాకతీయ రాజులు నిర్మించిన తటాకాలు సముద్రాలను తలపిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు తోడై వరదలు హోరెత్తుతూ మేడిగడ్డ లక్ష్మీబ్యారేజ్, సరస్వతీ బ్యారేజ్‌ల్లో చేరుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ బ్యారేజీలు పూర్తి సామర్ధానికి చేరువలో ఉండటంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో జోరుగా జలకళ సంతరించుకుంది. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత, పెన్‌గంగా నదుల ద్వారా భారీగా నీటి ప్రవాహం ఈ ప్రాజెక్టులకు చేరుతుండటంతో ఆ ప్రాజక్టెకు అనుసంధానమైన మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజ్, మర్కూర్ జలాశయాలతో పాటు ఇతర జలాశయాలకు నిరంతరంగా నీరు వదులుతున్నారు. కీలకమైన లక్ష్మీ బ్యారేజ్ (మేడు గడ్డ) 57 గేట్లు ఎత్తిన సంఘటన మళ్లీ పునరావృతమైంది. ఎగువ మహారాష్ట్రలో కరుస్తున్న వర్షాలకు ఉప్పొంగే ఉప నదులు, వాగులు త్రివేణిలో సంగమించగా అంతరాష్ట్ర బ్రిడ్జి గోదావరి ప్రవాహక సూచికకు చేరువగా 8 మీటర్ల స్థాయికి చేరింది.

ఈ క్రమంలో భారీగా వరద ఉధృతి కొనసాగుతుండడంతో సరస్వతి, లక్ష్మిబ్యారేజీలు జలాశయాలు సముద్రాలను తలపిస్తున్నాయి. ఈ విధంగా ప్రాణహిత, సరస్వతి ప్రాజెక్టుల ప్రవాహ వేగంతో ప్రాజెక్టుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. లక్ష్మి రిజర్వాయర్ ప్రస్తుతానికి 87.494 టిఎంసిలకు నీరు చేరింది. ఇన్‌ప్లో 3118100 క్యూ సెక్కులైతే బ్యారేజ్‌లో 3200ల క్యూసెక్కుల్లో నీరు ఉండగా 57 గేట్ల ద్వారా ఔట్‌ప్లోగా 321300 క్యూసెక్కుల నీరు దిగువ దేవాదులవైపు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. సరస్వతి బ్యారేజిలో(అన్నారం) జలాశయం బుధవారం 118.600 మీటర్ల స్తాయికి నీరు చేరింది. 10.87టిఎంసిల సామర్ధంగల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 9.25 టిఎంసిల నీరు ఉంది. ఇన్‌ప్లోగా 1870058 క్యూసెక్కులు ఓట్‌ప్లోగా 2340048గా దిగువకు తరలు తున్నది. ఈ విధంగా ప్రవాహహోరులో జరిగిన గణనీయమైన మార్పుతో రిజర్వాయర్‌లో పరిస్థితి హెచ్చుతగ్గులను బట్టి గేట్లు ఎత్తడం జరగుతుందని అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చేరుతున్న నీటి ప్రవాహం రాష్ట్రంలోని మిగతాప్రాజెక్టులకు ఊపిరని భావించవచ్చు. అయితే మహారాష్ట్రలో మరికొద్ది రోజులు కురువనున్న భారీ వర్షాలతో త్వరలోనే ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరి గేట్లు అన్నీ ఎత్తివేసే దృశ్యం సాకారం కానుందని అధికారులు చెప్పారు.

Heavy Water Inflow to Medigadda and Annaram Projects

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News