Thursday, April 25, 2024

డిజిటల్ చెల్లింపులు చేయకపోతే.. రూ.5 వేల జరిమానా

- Advertisement -
- Advertisement -
Digital-Payments
ఫిబ్రవరి 1 నుంచి అమలు

న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రూ.50 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ కంపెనీ వ్యాపార సంస్థలు వినియోగదారులకు తప్పనిసరిగా డిజిటల్ పేమెంట్ అవకాశం కల్పించాలని ప్రభుత్వం పేర్కొంది. 2020 జనవరి 1 నుంచి డిజిటల్ చెల్లింపులను ఆమోదించకపోయినట్లయితే రోజూ రూ.5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. షాప్‌లు, కంపెనీలు జనవరి 31 నాటికి డిజిటల్ చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఈమేరకు సిబిడిటి(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) ఆదేశాలు జారీ చేసింది.

ఎలక్ట్రానిక్ విధానం ద్వారా చెల్లింపులను అంగీకరించేందుకు గాను ప్రభుత్వం సంస్థలకు తగ్గినంత సమయం కూడా ఇచ్చింది. దీని ద్వారా డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం కల్పించాలన్నది ప్రభుత్వం లక్షంగా ఉంది. డిసెంబర్ 30న జారీ చేసిన సర్కులర్ ప్రకారం, 271డిబి సెక్షన్ కింద ఏ సంస్థ అయినా ఎలక్ట్రానిక్ చెల్లింపులు చేయనట్లయితే రూ.5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి ఎండిఆర్(మర్చంట్ డిస్కౌంట్ రేట్) లేకుండా ఉండాలంటే డిజిటల్ లావాదేవీలకు రూపే, యుపిఐ విధానంలో చెల్లింపు విధానం చేపట్టాలి. డిజిటల్ లావాదేవీలకు ఎండిఆర్ ఒక శాతం, ఇది వ్యాపారులు బ్యాంకులకు చెల్లిస్తాయి.

Hefty Fine For Not Using Digital Payments By Jan 31

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News