Monday, June 23, 2025

షాకింగ్..: రిటైర్‌మెంట్ ప్రకటించిన హెన్రిచ్ క్లాసెన్

- Advertisement -
- Advertisement -

సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen)  షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో రిటైర్ (Retirement) అవుతున్నట్లు ప్రకటించాడు. క్లాసెన్ ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడంతో సౌతాఫ్రికాలోనే కాదు.. ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. కనీసం మరో రెండు, మూడు ఏళ్లైన క్లాసెన్ తన కెరీర్‌ని కొనసాగించే అవకాశం ఉన్నా.. రిటైర్‌మెంట్ ప్రకటించడం అందరిని షాక్‌కి గురి చేసింది.

2018లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేసిన క్లాసెన్ (Heinrich Klaasen) .. సౌతాఫ్రికా తరఫున 4 టెస్టులు, 60 వన్డేలు, 58 టి-20లు ఆడాడు. ఇందుల్లో వన్డేల్లో 4 సెంచరీలు, 16 అర్థశతకాలతో 3245 పరుగులు చేశాడు. 2027లో సౌతాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ జరగనుంది. అంతకు ముందే క్లాసెన్ రిటైర్‌మెంట్ (Retirement) ప్రకటించడం సఫారీ అభిమానులను తీవ్రంగా నిరాశపరించింది.

ఇక ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడే క్లాసెన్‌కు ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఐపిఎల్‌లో ముఖ్యంగా కోల్‌కతాతో జరిగిన చివరి మ్యాచ్‌లో సెంచరీ సాధించిన క్లాసెన్‌పై ప్రశంసల వర్షం కురిసింది. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన క్లాసెన్‌ 172.70 స్ట్రయిక్‌రేట్‌తో 487 పరుగులు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News