Home తాజా వార్తలు ‘హ‌లో గురు ప్రేమకోస‌మే’ చాలా హాట్ గురూ..(టీజర్)

‘హ‌లో గురు ప్రేమకోస‌మే’ చాలా హాట్ గురూ..(టీజర్)

Hello Guru PremaKosame Official Teaser Released

హైదరాబాద్: ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా టాలీవుడ్ బడా నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘హ‌లో గురు ప్రేమకోస‌మే’. తాజాగా ఈ చిత్రం టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, ప్ర‌ణీత కథనాయికలుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ‘సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్’ ఫేం త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ చాలా హాట్ గా ఉంది. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్ తోపాటు టీజర్ తో  సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://youtu.be/im6N7TjaoZ0