Saturday, April 20, 2024

హెల్పేజ్ ఇండియాకు యుఎన్ పాపులేషన్ అవార్డు ప్రదానం

- Advertisement -
- Advertisement -

HelpAge India received 2020 UN Population Award

న్యూఢిల్లీ: జీవిత చరమాంకంలో అనాథలుగా మారిన వృద్ధుల సంక్షేమానికి పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థ హెల్పేజ్ ఇండియాకు ప్రతిష్టాత్మక 2020 ”యుఎన్ పాపులేషన్ అవార్డు” సంస్థాపరమైన క్యాటగిరిలో లభించింది. 1981లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నెలకొల్పిన యుఎన్ పాపులేషన్ అవార్డును జనాభా, ఆరోగ్య పరిరక్షణ రంగాలలో సేవలందచేస్తున్న సంస్థలు, వ్యక్తులకు ఏటా అందచేస్తారు. సమితికి న్యూయార్క్ కార్యాలయంలో గురువారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో అందచేశారు.

కాగా.. లైంగిక ఆరోగ్యం, లింగపరమైన హింసకు సంబంధించిన రంగాలలో సేవలందేస్తున్న భూటాన్ రాణిమాత గ్యాలియుమ్ సంగే చోడెన్ వాంగ్‌చుక్‌కు వ్యక్తిగత కేటగిరిలో 2020 యుఎన్ పాపులేషన్ అవార్డు లభించింది. ఈ అవార్డుల కింద స్వర్ణ పతకం, ప్రశంసా పత్రం, నగదు బహుమానం అందచేస్తారు. నాలుగు దశాబ్దాలుగా భారతదేశంలోని 20 రాష్ట్రాలకు పైగా విశేష సేవలందచేస్తున్న హెల్పేజ్ ఇండియా వృద్ధుల ఆరోగ్య సంరక్షణ, పోషణ, పెన్షన్లు తదితర వివిధ అంశాలలో పనిచేస్తోంది. భారతదేశంలో 10.6 కోట్ల మందికి పైగా వృద్ధులు ఉన్నట్లు అంచనా.

HelpAge India received 2020 UN Population Award

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News