Saturday, April 20, 2024

సైబరాబాద్ సిపిని కలిసిన అవంతి రెడ్డి

- Advertisement -
- Advertisement -

Hemanth Wife Avanthi Reddy Meets CP Sajjanar

హైదరాబాద్: హేమంత్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని అతడి కుటుంబ సభ్యులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్‌ను బుధవారం కలిశారు. ఈ మేరకు సిపికి వినతి పత్రం అందజేశారు. హేమంత్ కుటుంబ సభ్యులతో పాటు తనకు కూడా ప్రాణహాని ఉందని హేమంత్ భార్య అవంతిరెడ్డి తెలిపారు. హేమంత్ తర్వాత కూడా తమను కొందరు వ్యక్తులు ఫాలో అవుతున్నారని, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. అవంతి రెడ్డిని హత్య అనంతరం జరిగిన పరిణామాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అడిగి తెలుసుకున్నారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఉత్తరం రాసినట్లు తెలిపారు. తమకు భద్రత కల్పించాల్సిందిగా కోరడంతో వెంటనే స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. హేమంత్ ఇంటి వద్ద 24గంటలు భద్రతా ఏర్పాట్లు చేయాలని చందానగర్ పోలీసులను ఆదేశించారు.హేమంత్ హత్య కేసులో భాగస్వామ్యం ఉన్న వారిని ఎవరినీ వదలమని, శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు హేమంత్ హత్య కేసులో నిందితులు యుగేంధర్‌రెడ్డి, దొంతిరెడ్డి లకా్ష్మరెడ్డిని గచ్చిబౌలి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. హేమంత్ హత్యకు సంబంధించి లోతైన విచారణ చేయనున్నారు. గచ్చిబౌలి పోలీసులు ఐదు రోజుల పాటు నిందితులను విచారణ చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News