Home జాతీయ వార్తలు తెలంగాణ పోలీసులపై రాజస్థాన్ లో దాడి…

తెలంగాణ పోలీసులపై రాజస్థాన్ లో దాడి…

TS-Police

రాజస్థాన్: తెలంగాణ పోలీసులపై రాజస్థాన్ లో దాడి జరిగింది.ఈ ఘటనలో పోలీసులకు తీవ్రగాయాలు అయ్యాయి. వివరాలలోకి వెళితే…వరంగల్ సుబేదార్ పోలీస్టేషన్ కు చెందిన ఏఎస్ఐ వివకుమార్ ,ఇద్దరు కానిస్టేబుల్స్ ఓ చోరీ కేసులో నిందుతులని పట్టుకునేందుకు రాజస్థాన్ లోని బేల్వాడ జిల్లా హెర్నియ గ్రామానికి వెళ్లారు.ఆ గ్రామంలో నిందితుని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా స్థానికులు పోలీసులపై దాడి చేశారు.ఈ ఘటనలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం స్ధానిక ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Hernia Villagers Attacks On Telangana Police