Home తాజా వార్తలు కరోనా బాధితులకు అండగా ఉండాలి : అక్కినేని నాగార్జున

కరోనా బాధితులకు అండగా ఉండాలి : అక్కినేని నాగార్జున

Hero Akkineni Nagarjuna Comments On Coronaహైదరాబాద్ : కరోనా బాధితులకు అండగా ఉండాలని ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ప్రజలకు, తన అభిమానులకు పిలుపునిచ్చారు. కరోనా నుంచి కోలుకున్న వారు విధిగా ప్లాస్మా దానం చేయాలని, ప్లాస్మా దానం చేయడం వల్ల ఎటువంటి హాని జరగదని ఆయన స్పష్టం చేశారు. కరోనా పట్ల ప్రతిఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, నిర్లక్ష్యంగా ఉండరాదని ఆయన పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ఆయన సూచించారు.  టీ హోప్‌ అనే స్వచ్చంద సంస్థలో ప్రతిఒక్కరు భాగం కావాలని నాగార్జున కోరారు. అర్హులైన ప్రతిఒక్కరు కరోనా టీకా వేయించుకోవాని, కరోనా టీకా వల్ల ఎటువంటి ముప్పు వాటిల్లదని ఆయన తేల్చిచెప్పారు.