Home Default ఆరేళ్లలో అక్షయ్ సంపాదన 1,740 కోట్లు

ఆరేళ్లలో అక్షయ్ సంపాదన 1,740 కోట్లు

Hero Akshay Kumar Earned Rs 1740 Crore In Six Yearsముంబయి : ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఆరేళ్ల కాలంలో 1,740 కోట్లు ఆర్జించారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ ప్రకటించింది. కరోనా కాలంలో కూడా అక్షయ్ సంపాదన ఏమాత్రం తగ్గలేదని వెల్లడించింది. గతేడాది అక్షయ్ రూ.356.57 కోట్లు ఆర్జించినట్టు ‘ఫోర్బ్స్’ పేర్కొంది.  2019లో రూ.459.22 కోట్లు, 2018లో రూ.277.06 కోట్లు, 2016లో రూ. 208.42 కోట్లు సంపాదించినట్టు వెల్లడించింది. 2019లో అక్షయ్ బిజీబిజీగా మారిపోయాడని,  కేసరి, బ్లాంక్, మిషన్ మంగళ్, హౌస్‌ఫుల్ 4, గుడ్ న్యూజ్ వంటి సినిమాలతోపాటు పలు బ్రాండ్ల ప్రమోషన్ ద్వారా రూ.459.22 కోట్లు ఆర్జించాడని ‘ఫోర్బ్స్’ స్పష్టం చేసింది. అయితే  గతేడాది ‘లక్ష్మి’ సినిమాలో మాత్రమే అక్షయ్ నటించాడు. 2021లో ఆయన బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన ఏడు సినిమాల్లో నటిస్తున్నారు. బెల్ బాటం, సూర్యవంశీ, అత్రంగి రే, పృథ్వీ రాజ్, రక్షాబంధన్, రామ్ సేథు, బచ్చన్ పాండే సినిమాల్లో అక్షయ్ నటించనున్నారు.