Home తాజా వార్తలు గోపిచంద్ కొత్త సినిమా షురూ

గోపిచంద్ కొత్త సినిమా షురూ

Gopichandహైదరాబాద్ : మాచో హీరో గోపిచంద్ కొత్త సినిమా గురువారం ఉదయం ప్రారంభమైంది. ఆయన కొత్త సినిమా పూజా కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను క్లాప్ కొట్టారు. సినిమా ప్రారంభ కార్యక్రమానికి సినిమా యూనిట్ సభ్యులతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. గోపిచంద్ కు జోడీగా నటి తమన్నా నటిస్తుండగా, సిల్వర్ స్ర్కీన్ పైతాకంపై నిర్మిస్తున్నారు. గతంలో సంపత్ నంది, గోపి చంద్ కాంబినేషన్ లో గౌతమ్ నందా అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. బిను సుబ్రమణ్యం అనే కొత్త దర్శకుడితో గోపిచంద్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఇదిలా ఉండగా గోపిచంద్ నటించిన చాణక్య అక్టోబర్ 5న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. గత కొంతకాలంగా విజయాలు లేని గోపిచంద్ చాణక్య పై భారీ ఆశలు పెట్టుకున్నారు.