Home తాజా వార్తలు ‘సుల్తాన్’ నుంచి కార్తీ ’ఫస్ట్ లుక్‘ విడుదల

‘సుల్తాన్’ నుంచి కార్తీ ’ఫస్ట్ లుక్‘ విడుదల

Hero Karthi First Look Release From Sultan Movieచెన్నయ్ : ప్రముఖ కోలీవుడ్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘సుల్తాన్’. ఈ సినిమాకు ‘రెమో’ ఫేమ్ బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కార్తీకి జోడీగా రష్మిక నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కార్తీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. కార్తీ తన ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రజల ఆదరాబిమానాలే తనకు అండ అని ఆయన పేర్కొన్నారు. కార్తీ ఫస్ట్ లుక్ ఆకట్టుకునేవిధంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. కోలీవుడ్, టాలీవుడ్ లలో కార్తీ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. తెలుగులో కూడా ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కార్తీ నటించిన ’ఖైదీ‘ సినిమా ఇటీవల తెలుగులో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.