Home తాజా వార్తలు కెటిఆర్‌కు హీరో మహేశ్‌బాబు మద్దతు

కెటిఆర్‌కు హీరో మహేశ్‌బాబు మద్దతు

Mahesh Babu

 

పారిశుద్ధ్య సంకల్పానికి స్పందిస్తూ ట్వీట్

హైదరాబాద్ : రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌కు ప్రిన్స్ మహేష్‌బాబు మద్దతు తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు జ్వరాల బారిన పడి తీవ్రంగా బాధపడుతున్న నేపథ్యంలో ఇటీవల మంత్రి కెటిఆర్ సోషల్ మీడియా వేదికపై స్పందిస్తూ జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ‘వైరల్ జ్వరాలు, డెంగ్యూ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీ ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెలు, పూల కుండీలు, ఎయిర్ కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. దోమల వ్యాప్తికి ఇవే కారణం.

నా ఇంటి పరిసరాలను నేను తనిణీ చేసి నిల్వ ఉన్న నీటిని తొలగించాను. మీరు కూడా ఆ పనిచేసి ఫొటోలను నాతో పంచుకోండి’ అని కెటిఆర్ ట్వీట్ చేశారు. కెటిఆర్ ట్వీట్‌కు మంగళవారం యువ కథానాయకుడు ప్రభాస్ స్పందించగా, బుధవారం ప్రముఖ సినీ హీరో మహేష్‌బాబు సోషల్ మీడియా వేదికగా కెటిఆర్ మద్దతు తెలిపారు. ‘డైంగీ, వైరల్ జ్వరాలు ప్రస్తుతం నగరంలో వ్యాపిస్తున్నాయి. మీ చుట్టూ ఉన్న పరిసరాలలో నీటి నిల్వ లేకుండా చూసుకోండి. అప్రమత్తంగా ఉండడంతోపాటు మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోండి. హైదరాబాద్ నగరవాసులారా’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు.

Hero Mahesh Babu backs KTR