Home తాజా వార్తలు నాగబాబుకు కరోనా పాజిటివ్

నాగబాబుకు కరోనా పాజిటివ్

 

హైదరాబాద్: కరోనా వైరస్ ఎవరినీ వదిలిపెట్టడంలేదు. టాలీవుడ్ హీరో నాగబాబుకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘ వ్యాధి వచ్చిందని బాధగా ఉండడం సరికాదని, త్వరగా ఆ వ్యాధి నుంచి కోలుకొని మరొకరికి సాయం చేయాలని, తనకు కరోనా వైరస్ సోకిందని’ నాగబాబు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. సరైన జాగ్రత్తలు పాటించి కరోనాని జయిస్తానని, ప్లాస్మా దాతగా మారుతానని చెప్పుకొచ్చారు. నాగబాబు అభిమానులు సోషల్ మీడియాలో త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ‘నాగబాబు మామయ్య కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ’ నటుడు కల్యాణ్‌దేవ్ కామెంట్ చేశారు. తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నందకు కృతజ్ఞతలు అని కల్యాణ్‌దేవ్ కు నాగబాబు రిప్లై ఇచ్చారు.