Thursday, March 28, 2024

సాధారణ యువకుడి పాత్రలో…

- Advertisement -
- Advertisement -

 

నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘లవ్ స్టోరి’ నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దర్శకుడు శేఖర్ కమ్ముల, నాయిక సాయిపల్లవి, చిత్ర నిర్మాతలు కె.నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు చైతన్యకు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘లవ్ స్టోరి’ మూవీ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. థియేటర్ల పరిస్థితి మెరుగయ్యాక సినిమాను విడుదల చేయనున్నారు. ఓ ఆహ్లాదకర ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చైతూ బర్త్ డే స్పెషల్ పోస్టర్ చూస్తే…ఆయన లుంగీ, బనియన్ మీద సమ్‌థింగ్ స్పెషల్‌గా కనిపిస్తున్నారు. నిత్య జీవితంలో మనల్ని మనం పోల్చుకునే ఓ సాధారణ యువకుడి పాత్రలో నాగచైతన్య సహజంగా నటిస్తున్నట్లు ఈ లుక్ ద్వారా తెలిసింది. దర్శకుడు శేఖర్ కమ్ముల మార్క్ క్యారెక్టరైజేషన్ చైతూ లుక్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ “కొన్ని స్నేహాలు ఎంతో ఆనందాన్నిస్తాయి. చైతూతో అసోసియేషన్ అలాంటి సంతోషాన్నే ఇస్తుంది. హ్యాపీ బర్త్ డే చైతన్య” అని ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News