Home తాజా వార్తలు తాతగా నాగార్జున … మనవడిగా అఖిల్

తాతగా నాగార్జున … మనవడిగా అఖిల్

Nagarjunaహైదరాబాద్ : హీరో అక్కినేని నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయిన’ . ఈ సినిమాలో రెండు పాత్రల్లో నాగార్జున నటించి అలరించారు.  అయితే ఈ సినిమాకు రెండో భాగంగా ‘బంగార్రాజు’ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాతకు, మనవడికి మధ్య ఉన్న అనుబంధాలను చెప్పేదిగా ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాత పాత్రలో నాగార్జున, మనవడి పాత్రలో ఆయన రెండో తనయుడు అఖిల్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే మనవడి పాత్రకు మొదట నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్యను తీసుకోవాలని భావించారట. చైతన్య కంటే అఖిల్ ఈ పాత్రకు బాగుంటాడనే కారణంతో అతడినే మనవడి పాత్రకు తీసుకోవాలని నిర్ణయించారని తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు కల్యాణ్ కృష్ణ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారట. నాగార్జున ప్రస్తుతం ‘ మన్మథుడు2’ షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాతనే ‘బంగార్రాజు’ సినిమాను మొదలు పెట్టనున్నారని టాలీవుడ్ సమాచారం మేరకు తెలుస్తోంది.

Hero Nagarjuna New Movie Bangaarraju