Home తాజా వార్తలు ’యాత్ర-2‘లో నాగార్జున అక్కినేని

’యాత్ర-2‘లో నాగార్జున అక్కినేని

Hero Nagarjuna Plays YS Jagan Role In Yatra-2హైదరాబాద్ : మహి వి రాఘవ దర్శకత్వంలో ’యాత్ర-2‘ రాబోతున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మహి వి రాఘవ దివంగత సిఎం వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో ’యాత్ర‘ తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ సినిమాను ప్రేక్షులు విజయవంతం చేశారు. గత ఎపి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసిపి అధినేత జగన్ ఎపిలో పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి భారీ మెజార్టీతో అధికారం చేజిక్కిచుకుంది. దీంతో జగన్ పాద యాత్ర మొదలు ఆయన సిఎం అయ్యే వరకు జరిగిన ఘటనలతో ’యాత్ర-2‘ను మహి. వి. రాఘవ తీయనున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘యాత్ర-2‘ సినిమాకు సంబంధించిన  స్ర్కిప్ట్ ను మహి వి రాఘవ ఇప్పటికే సిద్ధం చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే వైఎస్ కుటుంబాన్ని అభిమానించే హీరో నాగార్జున ఈ సినిమాలో  జగన్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నాగార్జున నటిస్తే బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం ఖాయమని అటు వైఎస్ జగన్ అభిమానులు, ఇటు నాగార్జున అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటి వరకు మహి వి రాఘవ పాఠశాల, ఆనందోబ్రహ్మ, యాత్ర సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెస్తున్నారు. ’యాత్ర-2‘ తీస్తే, అది మహికి నాల్గో సినిమా అవుతుంది.