Wednesday, April 24, 2024

కరోనా విజృంభన చైనా కుట్రే: నిఖిల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చైనా కుట్ర వల్లే కంటికి కనిపించని మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోందని యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ అన్నారు. చైనాలోని వ్యూహాన్ లో ఉన్న బయోలాబ్ నుంచి కరోనా వైరస్ బయటకు వచ్చిందని ఆధారాలు బలపడుతున్నాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా ఈ నిజాన్ని దాయాలని ప్రయత్నిస్తున్నాయని న్యూయార్క్ పోస్ట్ వార్తా వెబ్‌సైట్ ప్రచురించిన కథనాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. తాజాగా ఈ ట్వీట్‌‌ను నిఖిల్ రీట్వీట్ చేస్తూ ఆ వాదనను సమర్థించారు. ”మనందరికీ తెలిసిన విషయాన్ని దాచిపెడుతున్నట్టు ఆధారాలు పెరుగుతున్నాయి. కరోనా గురించి తెలిసే.. చైనా, వుహాన్ నుంచి మిగిలిన ప్రాంతాలకు రవాణాను తక్షణమే నిలిపివేసింది. కానీ, వుహాన్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేయలేదు. చైనా ఎందుకిలా చేసింది?. వుహాన్ నుంచి మిగిలిన దేశాలకు ప్రజలు ప్రయాణించే అనుమతిని ఎందుకు కల్పించింది?” అని నిఖిల్ ట్వీట్టర్ ద్వారా ప్రశ్నించారు.

ఇలా చాలా మందికి చైనానే కావాలని ఈ వైరస్‌ను వ్యాప్తిచేసిందా? అనే అనుమానం కలిగిస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రస్తుతం చైనాలో తగ్గిపోవడంతో ఈ అనుమానానికి బలం చేకూర్చినట్లైంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మందిని బలితీసుకుంది. ప్రస్తుతం 20 లక్షలకు పైగా మంది కరోనాతో పోరాడుతున్నారు. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి పలు దేశాలు కరోనా దెబ్బకు శవాల గుట్టలుగా మారుతున్నాయి.

Hero Nikhil Doubts Corona outbreak is China’s Conspiracy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News