Tuesday, April 23, 2024

నితిన్ పెళ్లి వాయిదా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ హీరో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లో నితిన్, షాలినీ రెడ్డిల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. తర్వాత ఏప్రిల్ 16న దుబాయ్‌లో కొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య తన పెళ్లి జరగనున్నట్ల నితిన్ తెలిపాడు. కానీ, ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తన పెళ్లిని వాయిదా వేసినట్లు నితిన్ స్పష్టం చేశారు. అలాగే, మార్చి 30న త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉండ‌బోతున్న‌ానని, త‌న పుట్టిన రోజు వేడుకలను జ‌ర‌ప‌వ‌ద్ద‌ని భిమానులకు నితిన్ విజ్ఞ‌ప్తి చేశాడు. అంద‌రూ ఇంట్లోనే ఉండి, దేశ‌సేవ చేసే అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని నితిన్ కోరాడు. కరోనాను ఎదుర్కొనేందుకు తన వంతు సాయంగా నితిన్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయనిధికి రూ.10 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించాడు.

Hero Nithin and Shalini’s Wedding Postponed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News