Home ఆంధ్రప్రదేశ్ వార్తలు జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌భాస్ కామెంట్ (వైరల్ వీడియో)

జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌భాస్ కామెంట్ (వైరల్ వీడియో)

prabhas-And-Jaganఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్ర‌శంస‌ల జల్లు కురిపించారు. సాహో ప్ర‌మోష‌న్‌లో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌ని ఓ యాంక‌ర్ సిఎం జ‌గ‌న్ గురించి ఓ ప్రశ్న అడిగాడు. త‌మిళ‌నాడులో జ‌గ‌న్‌ని పొలిటికల్ బాహుబలిగా అభివర్ణిస్తున్నారని, ఆయన గురించి మీరు ఏం అనుకుంటున్నారంటూ ప్ర‌శ్నించారు. అందుకు ప్ర‌భాస్‌ నాకు పాలిటిక్స్ లో పెద్ద‌గా నాలెడ్జ్ లేదు. కాక‌పోతే యంగ్ సిఎంగా జ‌గ‌న్ ఎపిని అభివృద్ది ప‌థంలో న‌డిపిస్తార‌నే న‌మ్మకం ప్రజలతో పాటు నాలో కూడా ఉంది. సిఎం జ‌గ‌న్ ప‌నితనం బాగుంది అని ప్రభాస్ తెలిపాడు. 151 సీట్ల‌తో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న జగన్‌పై ప్ర‌భాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్ర‌భాస్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైర‌ల్ అయింది.

Hero Prabhas comments on Jagan governance