హైదరాబాద్ : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఈ నెల 23న తన పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. ఈ క్రమంలో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. డార్లింగ్ కామన్ డిపితో నెట్టింట ఆయన అభిమానులు సందడి చేస్తున్నారు. ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకుని, ఆయన నటించే సినిమాల నుంచి కొత్త కొత్త వార్తలు వస్తాయన్న ఆశలో ఆయన అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ నుంచి ఆయేన కొత్త లుక్ ను , సినిమా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ శుక్రవారం విడుదల చేశారు. ఈ లుక్ లో ప్రభాస్ చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. దీంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.