Home Default క్లిష్టంగా హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి

క్లిష్టంగా హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి

Hero Rajasekhar Health Condition Is Criticalహైదరాబాద్ : కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హీరో డాక్టర్ రాజేశేఖర్ ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇటీవల రాజశేఖర్ తో పాటు ఆయన భార్య జీవిత, కుమార్తెలు శివానీ, శివాత్మికలు కరోనా బారిన పడ్డారు. అయితే ఆయన ఇద్దరు కుమార్తెలు కరోనా నుంచి కోలుకున్నారు. కానీ రాజశేఖర్, జీవితలు మాత్రం కరోనాతో పోరాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే తన తండ్రి రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారిందని ఆయన కుమార్తె శివాత్మిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన తండ్రి కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల ప్రేమ, ఆశీస్సులతో తన తండ్రి త్వరగా కోలుకుంటారన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.