Home తాజా వార్తలు హీరో రామ్ తో త్రివిక్రమ్ సినిమా

హీరో రామ్ తో త్రివిక్రమ్ సినిమా

Hero Ram Film In Trivikram Srinivas Directionహైదరాబాద్ : ఎనర్జిటిక్  హీరో రామ్ పోతినేనితో ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా  ‘అల వైకుంఠపురములో’  బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్ టిఆర్ తో సినిమా తీస్తానని త్రివిక్రమ్ ప్రకటించారు. ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ను పెడుతున్నట్టు ప్రచారం కూడా జరిగింది. కరోనా కారణంగా పరిస్థితులు తారుమారు కావడంతో  త్రివిక్రమ్ తో సినిమాకు ఎన్ టిఆర్ సిద్ధం కాలేకపోయారు. ప్రస్తుతం ఎన్ టిఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయాలన్న ఆలోచనతో ఎన్ టిఆర్ ఉన్నారట. దీంతో ఈ సమయంలో రామ్ పోతినేనితో ఓ సినిమా తీయాలన్న ఆలోచనకు త్రివిక్రమ్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ’ఇస్మార్ట్ శంకర్‘తో  రామ్ మంచి విజయం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన సినిమా రెడ్ పూర్తి చేశారు. వచ్చే సంక్రాంతికి రెడ్ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అనంతరం త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు రామ్ అంగీకరించారని సమాచారం. త్వరలోనే రామ్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రానుందన్న వార్తలు టాలీవుడ్ లో వస్తున్నాయి. అయితే రామ్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాపై అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు.