Home తాజా వార్తలు ర‌మేష్ వ‌ర్మ‌ దర్శకత్వంలో రవితేజ 67వ సినిమా

ర‌మేష్ వ‌ర్మ‌ దర్శకత్వంలో రవితేజ 67వ సినిమా

Hero Ravi Teja 67th Movie In Ramesh Varma Directonహైదరాబాద్ : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ’క్రాక్‘ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న విషయం తెలిసిందే. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటి శృతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో రవితేజ, అప్సరారాణిలపై  ప్రత్యేకగీతాన్ని తీస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకోవడంతో రవితేజ మరో సినిమాను లైన్ లో పెట్టారు. వీర సినిమా ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ‌తో క‌లిసి ర‌వితేజ త‌న 67వ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో  డింపుల్ హయాతి, మీనాక్షి చౌధురి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డింపుల్ హయాతి ‘గద్దలకొండ గణేష్‌’లో ‘జర్ర జర్ర…’ పాటలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.  ‘రాక్షసుడు’ సినిమా తర్వాత రమేశ్ వర్మ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబరు 2న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు షూటింగ్ ముహూర్తంపై వివరాలు ప్రకటించనున్నారు.