Home తాజా వార్తలు అజయ్ భూపతికి నో చెప్పిన రవితేజ

అజయ్ భూపతికి నో చెప్పిన రవితేజ

Hero Ravi Tejaహైదరాబాద్ : ‘ఆర్ ఎక్స్100’ సినిమాతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. తన తరువాతి సినిమాను మాస్ మహారాజ రవితేజతో తెరకెక్కించాలని అజయ్ భూపతి భావించారు. రవితేజ హీరోగా మహాసముద్రం సినిమాను తీయాలని అజయ్ భూపతి సన్నాహాలు చేసుకున్నారు.  అయితే ఈ సినిమాకు రవితేజ నో చెప్పాడట. అజయ్ భూపతి చెప్పిన మహాసముద్రం కథ ఫస్టాఫ్ తనకు నచ్చిందని, సెకాండాఫ్ లో కొన్ని మార్పులు చేయాలని రవితేజ అజయ్ భూపతికి సూచించాడట. అయితే మహాసముద్రం సినిమా సెకండాఫ్ లో మార్పులు చేసేందుకు అజయ్ భూపతి ఒప్పుకోకపోవడంతో, తాను ఈ సినిమాను చేయలేనని రవితేజ స్పష్టం చేసిట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఒక వేళ సెకండాఫ్ లో మార్పులు చేస్తే మహాసముద్రంలో నటించేందుకు తాను సిద్ధమేనని రవితేజ తేల్చి చెప్పడంతో అజయ్ భూపతి మరో హీరోను ఎంపిక చేసుకునే పనిలో పడ్డాడడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Hero Ravi Teja Says No To Director Ajay Bhupathi