Home తాజా వార్తలు జిహెచ్ఎంసి పార్కును దత్తత తీసుకుంటా : హీరో శర్వానంద్

జిహెచ్ఎంసి పార్కును దత్తత తీసుకుంటా : హీరో శర్వానంద్

Hero Sharwanand Adopted GHMC Parkహైదరాబాద్ : టిఆర్ఎస్ ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలేంజ్ కు అపూర్వ స్పందన వస్తోంది. సంతోష్ కుమార్ చాలేంజ్ ను స్వీకరించి చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. ఈ క్రమంలోనే హీరో శర్వానంద్ బంజారాహిల్స్ లోని తన ఇంటి పక్కనే ఉన్న పార్కులో ఎంపి సంతోష్ కుమార్ తో కలిసి సోమవారం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన ప్రజలను కోరారు. తన ఇంటి పక్కన ఉన్న జిహెచ్ఎంసి పార్కును దత్తత తీసుకుని తన సొంత ఖర్చులతో అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎంఎల్ఎ దానం నాగేందర్, పలువురు టిఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.