Home తాజా వార్తలు కిచ్చా సుదీప్ ‘ఫాంటమ్’ ఫస్ట్‌లుక్ రిలీజ్‌

కిచ్చా సుదీప్ ‘ఫాంటమ్’ ఫస్ట్‌లుక్ రిలీజ్‌

Hero Sudeep Phantom Movie First Look Releaseబెంగళూరు : ప్రముఖ కన్నడ హీరో కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలోనటిస్తున్న సినిమా ’ఫాంటమ్‘. ఈ సినిమాకు అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను దర్శకుడు అనూప్ భండారి మంగళవారం విడుదల చేశారు. ఈ సినిమాలో సుదీప్ విక్రమ్ రోనా అనే పాత్రలో నటిస్తున్నారని, ఈ సినిమా పవర్ పుల్ గా ఉంటుందని దర్శకుడు అనూప్ తెలిపారు. కరోనా నిబంధనలకు లోబడి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో చాలా భాగం జరిగింది. రాజమౌళి తీసిన ’ఈగ‘లో విలన్ పాత్రలో నటించిన సుదీప్ తెలుగు ప్రేక్షకులను చాలా దగ్గరైన విషయం తెలిసిందే. ’ఫాంటమ్‘ సినిమాను కూడా తెలుగులో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.