Home తాజా వార్తలు బాలీవుడ్ లోకి విజయ్ దేవరకొండ ఎంట్రీ…?

బాలీవుడ్ లోకి విజయ్ దేవరకొండ ఎంట్రీ…?

Hero Vijay Devarakonda Act In Bollywood Movieముంబయి : ప్రముఖ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. భారత వింగ్ కమాండర్ అభినందన్ జీవిత కథ ఆధారంగా రూపొందే  సినిమాలో విజయ్ నటించనున్నారని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. స్క్రిప్ట్ నచ్చడంతో విజయ్ ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించారని బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని, సంజయ్‌లీలా భన్సాలీ, భూషణ్‌కుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాపై ఇంత వరకు స్పష్టత రాలేదు. ఇదిలాఉండగా విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న ’ఫైటర్‘ సినిమాలో నటిస్తున్నారు. విజయ్ పక్కన బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తున్నారు.