Home సినిమా యాక్షన్ సన్నివేశాల్లో నటించా

యాక్షన్ సన్నివేశాల్లో నటించా

pooja

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన చిత్రం ‘పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం’. పూజా కుమార్ హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం నవంబర్ 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆమెతో ఇంటర్వూ విశేషాలు… 

యాక్షన్, డ్రామా సహా…
మంచి యాక్షన్ థ్రిల్లర్ ‘పిఎస్‌వి గరుడవేగ..’. ఇందులో డ్రామా, ఎమోషన్స్‌తో సహా అన్నీ ఉంటాయి. తెలుగు ఇండస్ట్రీలో ఇదొక పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుంది. సినిమాలోని ట్రైన్స్, బైక్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి.
టెన్షన్ పడే భార్యగా…
సినిమాలో నేను గృహిణి పాత్రలో నటించాను. భర్త రాజశేఖర్ దేశం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటాడు. భర్తకు ఏమవుతుందోనని ఎప్పుడూ టెన్షన్ పడుతుంటుంది భార్య. తన కోసం భర్త కొంత సమయాన్ని కేటాయించాలనుకునే భార్య పాత్ర నాది.
దర్శకుడి విజన్ నచ్చింది…
సినిమాకు ముందు దర్శకుడు ప్రవీణ్ సత్తారు నాకు 120 పేజీలున్న బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చారు. అది చదువుతుంటే ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. అందుకే ఈ సినిమాలో నటించాను. దర్శకుడి విజన్ నాకు చాలా బాగా నచ్చింది.
అద్భుతంగా నటించారు…
హీరో రాజశేఖర్ చాలా ఎనర్జిటిక్. ఆయన ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. అయితే ఈ సినిమాకు ముందు నేను ఆయన పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సినిమాలు చూశాను. వాటిలో ఆయన నటన, యాక్షన్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
క్లైమాక్స్‌లో నేను ఉంటా…
సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో నేను కూడా ఉంటాను. మామూలుగా క్లైమాక్స్‌లో హీరో, విలన్ మాత్రమే ఉంటారు. కానీ ఈ సినిమా క్లైమాక్స్‌లో నేను కూడా ఉంటాను. ఇక సినిమాలో హీరో హీరోయిన్లతో పాటు 10 ముఖ్యమైన క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి దానికి ప్రాముఖ్యత ఉంటుంది.
కఠినమైన వాతావరణంలో…
మన దేశంతో పాటు మలేషియా, జార్జియాలలో సినిమా షూటింగ్ జరిగింది. జార్జియాలోని అత్యంత ఎత్తయిన, పెద్దదైన ఇంగురి డ్యామ్ మీద షూటింగ్ చేశాం. కఠినమైన వాతావరణంలో పనిచేశాం.