Home Default అభిమానులకి తాప్సీ బంపరాఫర్!

అభిమానులకి తాప్సీ బంపరాఫర్!

Aanando-Bramha

హైదరాబాద్ : ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులకి పరిచయమైన పంజాబీ సుందరీ తాప్సీ ప్రస్తుతం హిందీలో వరుస విజయాలతో దూసుకుపోతుంది. కాగా తాజాగా వచ్చిన ఘాజీ చిత్రం పెద్ద సక్సెస్ కావడంతో ఇటు తెలుగు, అటు హిందీ భాషల్లో తాప్సీకి అవకాశాలు వరుసకడుతున్నాయి. సరే అసలు విషయానికొస్తే.. ట్విట్టర్ వేదికగా తాప్సీ తన అభిమానులకు  తన అభిమానులకు బంపరాఫర్ ఇచ్చింది. తాజాగా ఓ సినిమాకు సంబంధించిన పోస్టర్ ని తాప్సీ ట్వీట్ చేసింది. తిరగేసి ఉన్న ఈ సినిమా పేరును కనిపెట్టిన వాళ్లు తనతో సెల్ఫీ దిగే ఛాన్స్ కొట్టేయొచ్చని తాప్సీ పేర్కొంది. దీంతో ఈ ట్వీట్ కు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మే 28న విడుదల చేస్తున్నట్లు కూడా పోస్టర్ లో పేర్కొన్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సినిమా పేరు కామెంట్ చేసి తాప్సీతో ఫోటో దిగే ఛాన్స్ కొట్టేయండీ….