Home సినిమా టాలీవుడ్‌పైనే నా దృష్టంతా

టాలీవుడ్‌పైనే నా దృష్టంతా

Lavanya-Tripati

వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనువైట్ల దర్శకత్వంలో ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించిన చిత్రం ‘మిస్టర్’. తాజాగా విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో ఆడుతోంది. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించింది. ఆమె చెప్పిన విశేషాలు…

గొప్ప అనుభవాన్నిచ్చింది…
‘మిస్టర్’ జర్నీ చాలా సాఫ్ట్‌గా జరిగింది. శ్రీనువైట్ల వంటి డైరెక్టర్‌తో పనిచేయడం గొప్ప అనుభవాన్నిచ్చింది. ఈ సినిమాతో హీరోయిన్‌గా నాకు మంచి పాపులారిటీ వచ్చింది. నా కెరీర్‌లో ‘మిస్టర్’ మరచిపోలేని సినిమాగా నిలిచింది.

భిన్నమైన క్యారెక్టర్…
సినిమాలో చంద్రముఖి అనే క్యారెక్టర్‌లో కనిపిస్తా. ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్‌కు భిన్నంగా ఈ రోల్ ఉంటుంది. సెల్‌ఫోన్, కంప్యూటర్ గురించి ఏమీ తెలియని క్యారెక్టర్ ఇది. చంద్రముఖి క్యారెక్టర్‌ను ఛాలెం జింగ్‌గా చేశాను.

భిన్నమైన లుక్‌లో...
హాఫ్ శారీలో సినిమాలో అందంగా కనిపిస్తా. ఇండియన్, వెస్ట్రన్ స్టయిల్ వస్త్రాలు కూడా ధరించాను. క్యారెక్టర్ పరంగా కళ్లు పెద్దగా ఉండేందుకు లెన్స్ పెట్టుకున్నాను. రాజుల కాలం నాటి స్టయిల్లో ఉండే ఆభరణాలను ధరించాను.

వరుణ్‌కు మంచి భవిష్యత్తు…
వరుణ్‌తేజ్ మంచి నటుడు. హీరోగా అతనికి మంచి భవిష్యత్తు ఉంది. శ్రీనువైట్ల సినిమాను చాలా చక్కగా తీశారు. ముఖ్యంగా నా క్యారెక్టర్‌ను చక్కగా డిజైన్ చేశారు. ప్రతి సీన్‌ను ఎలా చేయాలో చెప్పి చేయించు కున్నారు.

నెక్స్ మూవీస్…
ప్రస్తుతం నా దృష్టంతా టాలీవుడ్‌పైనే. తెలుగు లోనే ఎక్కువగా సిని మాలు చేయాల నుంది. పక్కా కమర్షి యల్ మూవీ ‘రాధ’ చేశాను. అలాగే నాగ చైతన్య హీరోగా రూపొందు తున్న చిత్రంలో నటిస్తున్నా. తమి ళంలో మాయావన్ అనే సినిమా చేశాను.