Home తాజా వార్తలు సైరాకు తొలగిన అడ్డంకులు

సైరాకు తొలగిన అడ్డంకులు

Sye Raa Movieహైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘ సైరా… నరసింహారెడ్డి’ సినిమాకు అడ్డంకులు తొలగిపోయాయి.  స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.  ఈ సినిమా విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని తమిళనాడు తెలుగు యువ సంఘం నేత కేతిరెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ ను మంగళవారం కోర్టు కొట్టివేసింది. సినిమాను సినిమాగానే చూడాలని గతంలో గాంధీజీ తదితర సినిమాలను హైకోర్టు ప్రస్తావించింది. చాలా మంది మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా ఎవ్వరూ చూపించలేదని కోర్టు పేర్కొంది. మొదట బయోపిక్ అని చెప్పి, సైరా సినిమా చరిత్రను తప్పుదోవ పట్టించేవిధంగా తీశారని కేతిరెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సైరా సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు నిర్మాత రామ్ చరణ్ అన్ని ఏర్పాట్లు చేశారు.

High Court Green Signal To Sye Raa Movie Release