Thursday, April 25, 2024

పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

- Advertisement -
- Advertisement -

High Court

 

తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం పదో తరగతి పరీక్షల నిర్వహనపై హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. జిహెచ్ఎంసి, రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లో పరీక్షలు వాయిదా వేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఈ రెండు జిల్లా పరిధి మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జిహెచ్ఎంసి, రంగారెడ్డి జిల్లాల్లోని విద్యార్థులకు అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ అవకాశం ఇవ్వాలని.. సప్టిమెంటరీ విద్యార్థలను కూడా రెగ్యులర్ గా గుర్తించాలని కోర్టు చెప్పింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. జిహెచ్ఎంసి, రంగారెడ్డి జిల్లాలో పరిధిలోనూ పరీక్షలకు అనుమతివ్వాలని  ప్రభుత్వం కోరగా.. విద్యార్థులకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. హాట్ స్పాట్లలో పరీక్షలకు అనుమతిలేదని కోర్టు స్పష్టం చేసింది.

High Court green signal to TS SSC Exams 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News