Tuesday, April 16, 2024

నగరంలో పది పబ్‌లకు హైకోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

High Court notices to ten pubs in the city

 

మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న 10 పబ్బులపై హైకోర్టు సీరియస్ కావడంతో పాటు నోటీసులను జారీ చేసింది. అదేవిధంగా ఈ నెల 31లోగా పబ్‌లను కట్టడి చేయాలని సూచించింది. రెసిడెన్షియల్ ప్రాంతంలో పబ్‌లకు అనుమతి ఇస్తున్నారంటూ దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పబ్బులతో పాటు హైదరాబాద్ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. నాయిస్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ 2000 నిబంధలు ఉల్లంఘించారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ప్రతి రోజూ అర్థరాత్రి వరకు అధిక శబ్దంతో పబ్బులు నడుపుతున్నారని, పబ్‌ల సమీపంలో నివసించే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రెసిడెన్షియల్ అసోషియేషన్ పిటిషన్‌లో పేర్కొంది. దీంతో నిబంధనలు ఉల్లంగించిన పబ్బులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

నగరంలోని 800 జూబ్లీ , హైలైఫ్ బ్రెవింగ్ కంపనీ , ఫర్జీ కెఫె , అమ్నిషియా లాంజ్ బార్ , డైలీ డోస్ బార్ హప్, డర్టీ మార్టిని కిచెన్ అండ్ కాక్ టాయిల్ లాంచ్ , బ్రాడ్ వే పబ్ , మ్యాకే బ్రో వరల్ కాపీ బార్, హార్ట్ కప్ కాపీ పబ్బులకు నోటీసులు జారీ చేసింది. ఈ పది పబ్‌లు పూర్తి స్థాయిలో నివాసిత ప్రాంతాల్లో ఉన్నాయని, పబ్లిక్‌కు చాలా ఇబ్బందిగా మారిందని, అ పబ్‌లకు ఏ విధంగా అనుతిచ్చారో వాటన్నింటిపై పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై ఈ నెల 29 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ కమిషనర్, తెలంగాణా ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

రైతు మరణంపై విచారణ 

రైతు భూమ్ బొయి మరణంపై హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరిగింది. కామారెడ్డి జిల్లా శాంతాపూర్‌లో పోలీసులు కొట్టడం వల్లే రైతు భూమ్ చనిపోయాడని హైకోర్టును మృతుడి కుటుంబసభ్యులు ఆశ్రయించారు. భూమ్ బొయికి అందించిన చికిత్సకు సంబంధించిన నివేదికను సీల్ కవర్‌లో హైకోర్టుకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ అందించారు. అయితే మెడికల్ టెర్మినాలజీలో రూపంలో ఉన్న నివేదికను సూపరింటెండెంట్ అందజేశారు. దీంతో తమకు అర్థమయ్యే రీతిలో పూర్తి నివేదికను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News