Home తాజా వార్తలు పంచాయతీరాజ్ కమిషనర్‌కు హైకోర్టు ఉత్తర్వులు

పంచాయతీరాజ్ కమిషనర్‌కు హైకోర్టు ఉత్తర్వులు

High-court

హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల రాతపరీక్ష ఫలితాలను ఈ నెల 30 వరకు ప్రకటించవద్దని రాష్ట్ర ప్రభు త్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది.  జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల నియామకం పై తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ సబార్డినేట్ రూల్స్-2010 ప్రకారం తమ తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాల ని పిటిషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో మొత్తం 9,355 పంచాయతీ కార్యదర్శి పోస్టుల నియామకానికి అక్టోబరు 10న రాత పరీక్ష నిర్వహించగా.. పేపర్‌-1 పరీక్షకు 4,77,637(84.91శాతం) మంది, పేపర్‌-2 పరీక్షకు 4,75,012 (84.45శాతం) మంది హాజరయ్యారు. అక్టోబరు 18న ఈ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని విడుదల చేశారు.

High Court order to Panchayati Raj Commissioner