Tuesday, April 23, 2024

గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టేకు హైకోర్టు నిరాకరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వచ్చే నెల జూన్ 11వ తేదీన జరగనున్న గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్- (టిఎస్‌పిఎస్‌సి) జూన్ 11వ తేదీ న నిర్వహించ తలపెట్టిన గ్రూప్1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని కో రుతు హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై గురువారం న్యాయస్థానం విచార ణ చేపట్టింది. అయితే గురువారం ఉదయమే రిట్ పిటిషన్ జస్టిస్ కె. లక్ష్మణ్ తో కూడిన హైకోర్టు బెంచ్ ముందుకు వచ్చింది. కాగా, తన కుమార్తె కూడా గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షల రాసినందున తాను పిటిషన్‌ను విచారించలేనని జస్టిస్ కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. పిటిషన్ ను మధ్యాహ్నం మరో బెంచ్ కు పంపిస్తానని వివరించారు.

లంచ్ తర్వాత జస్టిస్ పుల్లా కార్తీక్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ వెళ్లగా విచారణ జరిగింది. గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వివిధ పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసినప్పుడు సంబంధిత పరీక్షల మధ్య 2 నెలల వ్యవధి ఉండాలన్న నిబంధనను అమలు చేయకుండా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ జారీ చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ 36 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్, కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, సిట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు మరో నాలుగు వారాలకు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News