Thursday, April 25, 2024

సెర్బియా గాడిద పాల జున్నుకు బలే డిమాండ్

- Advertisement -
- Advertisement -

ఆగ్నేయ ఐరోపా లోని సెర్బియా దేశం లో ఒక తెగ గాడిదల పాలజున్నుకు బలే డిమాండ్ కనిపిస్తోంది. తెల్లగా చిక్కగా ఉండే ఈ జున్ను ఆరగిస్తే ఆరోగ్యం బాగా ఉంటుందన్న నమ్మకం ఆ దేశంలో బాగా ఉంది. కిలో జున్ను 1130 డాలర్లకు అమ్ముతున్నారంటే దీని గిరాకీ ఎలా ఉందో చెప్పవచ్చు. ప్రపంచం మొత్తం మీద ఇంత ఎక్కువ ఖరీదైన జన్ను మరేదీ లేదని చెబుతున్నారు. ఈ గాడిదల పాలతో జున్ను తయారు చేసే రైతుల్లో ఒకరు 200 గాడిదల నుంచి జున్ను తయారు చేసి అమ్ముతుండడం గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఈ గాడిదలను
ఉత్తర సెర్బియాలో సహజ ప్రకృతి వాతావరణంలో పెంచుతుంటారు.

స్తన్య క్షీరంతో సమానంగా ఈ పాలను విలువైనవిగా చూస్తుంటారు. ఈ పాలను సేవిస్తే ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు వంటి అనేక రుగ్మతలు నయమవుతాయని చెబుతుంటారు. పసిబిడ్డలు మొదటి రోజే ఎలాంటి నీళ్లు తాగకుండా ఈ పాలను తాగవచ్చని అక్కడి వారు అంటుంటారు. అయితే ఈ పాల గురించి వైద్యపరంగా ఎలాంటి ప్రమాణాలు ఇంతవరకు వెల్లడి కాలేదు. ఈ పాలలో ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆవు పాలు పడని వారికి ప్రత్యామ్నాయంగా ఈ పాలను వినియోగించవచ్చని ఐక్యరాజ్యసమితి కూడా సూచించింది. ఈ పాలను జన్నుగా తయారు చేయడానికి ఎవరూ సిద్ధం కావడం లేదు. 2012 లో సెర్బియా టెన్నిస్ క్రీడాకారుడు నోవక్ జెకోవోక్ ఏడాది పాటు ఈ పాలను సేవించడంతో ఈ పాల గురించి బాగా ప్రచారం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News