Wednesday, March 22, 2023

హైటెన్షన్ భూ బాధితుల బాధ పట్టదా!

- Advertisement -

cong2

*కరెంటు ఇస్తున్నామని జబ్బలు చర్చుకుంటున్న ప్రభుత్వం
*నష్టపరిహారం ఇవ్వడంలో అలసత్వం ఎందుకు? : రాష్ట్ర కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు
*వచ్చేనెల సంగారెడ్డిలో రిజర్వేషన్ల సాధనకై బహిరంగ సభ : జగ్గారెడ్డి

మన తెలంగాణ/సంగారె డ్డి టౌన్ : టిఆర్‌ఎస్ ప్రభు త్వం 24 గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప సాధించింది ఏమీ లేదని రాష్ట్ర కాంగ్రెస్ నా యకులు వి.హనుమంతరావు అన్నారు. శుక్రవా రం సంగారెడ్డిలోని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదంటూ ప్రగల్భాలు పలుకుతుందన్నారు. కొనుగోలు చేసిన కరెంటును ఉత్పత్తి చేసినట్లుగా చూపుతున్నారని ఆరోపించారు. విద్యుత్‌ను అందించడం ఆనందమే అయినా ఆ కరెంటు సరఫరాకు రైతుల భూమి నుండి వేసిన హైటెన్షన్ వైర్లు, టవర్లతో అనేక మంది రైతులు రోడ్డున పడ్డారన్నారు. వారికి సరైన నష్టపరిహారం ఇవ్వకుండా ఇ బ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కమర్షియల్ ఏరియాలో నాలుగున్నర ల క్షలు ఇవ్వాలని భూమి విలువ ప్రకారం ఇవ్వాల్సి ఉండగా లక్ష50వేల రూపాయలు అందించి వారిని మభ్యపెడుతున్నారన్నారు. విద్యుత్ హైటెన్షన్ వైర్లు టవర్లు ఉన్న వ్యవసాయ భూములకు బ్యాంకులు సైతం అప్పులు ఇవ్వవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై త్వరలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రైతులు 9గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తే సరిపోతుందని చెబుతున్నా గొప్పలు చెప్పుకునేందుకు 24గంటలు విద్యుత్‌ను ఇస్తున్నా రైతులకు దానివల్ల ఉపయోగం లేదన్నారు. ప్రతిపక్షాలతో ఆత్మహత్యల నివారణకై స మావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదని, మొన్నటికి మొన్న జ రిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో సైతం ప్రతిపక్షాలను ఆహ్వానించకపోవడం అహంకారానికి నిదర్శనమన్నారు. మెజారిటీ ఉందని ఇష్టానుసారం వ్యవహరిస్తూ.. ప్రజాధనాన్ని ప్రకటనల తో వృధాచేస్తున్నారన్నారు. హైటెన్షన్ వైర్ల విషయమై నష్టపోయిన భూములను వెంటనే సర్వేచేయించి వారిని వెంటనే ఆదుకోవాలన్నారు. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు వత్తాసు పలకడం మానుకోవాలన్నారు. ఇసుక మాఫీ యా, తెలంగాణలో అధికారుల ప్రాణాలు బలిగొంటున్నా పట్టించుకోకుండా మాటలకే పరిమితమైందన్నారు. కేంద్ర ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.
మైనార్టీల 12 రిజర్వేషన్లు ఏమయ్యాయి… మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, సంగారెడ్డి మాజీ ఎ మ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే 4నెలల్లో రిజర్వేష న్లు కల్పిస్తామని, మైనార్టీలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని నాలుగు సంవత్సరాలు కావస్తున్నా రిజర్వేషన్లు కల్పించలేదన్నారు. రిజర్వేషన్ల సాధనకై జాతీయ కాంగ్రెస్ నాయకుడు గులాంనబీఅజాద్‌తో సంగారెడ్డిలో భారీ బహిరంగసభను వచ్చేనెలలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించా రు. ఈ నెల 10న రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫక్రోద్దిన్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లి గులాంనబీఆజాద్‌ను కలిసి తేదీలను ప్రకటిస్తామన్నారు. మైనార్టీల కు కాంగ్రెస్ చేసిన మేలుతో పోలిస్తే టిఆర్‌ఎస్ చేసిందేమీలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News