Home జాతీయ వార్తలు అమిత్ షా అత్యవసర భేటీ…

అమిత్ షా అత్యవసర భేటీ…

Amit-Shahన్యూఢిల్లీ: పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌ పాల్గొన్నారు. సోమవారం రాజ్యసభలో జమ్ము కశ్మీర్‌ రిజర్వేషన్‌(రెండో సవరణ) బిల్లును అమిత్‌ షా ప్రవేశపెట్టబోతున్నారు. జమ్ము కశ్మీర్‌లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్లను ఈ బిల్లు కల్పించనుంది. జమ్ము కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశముంది. సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో పూంచ్‌లో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలు మోహరించాయి.
High level conference chaired by Amit Shah