Home Default అత్యున్నత స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్

అత్యున్నత స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్

Anushka

‘బాహుబలి’ తర్వాత తెలుగు ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. సినిమా నిర్మాణ విలువలు గొప్పగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్ మీద నడిచే సినిమాలైతే హై స్టాండర్డ్‌లో ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే నిర్మాతలు, దర్శకులు విజువల్ ఎఫెక్ట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. వాటి విషయంలో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో జి.అశోక్ నిర్మిస్తున్న ‘భాగమతి’ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. చిత్రీకరణ పూర్తయిపోయినా కూడా నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ విజువల్ ఎఫెక్ట్‌లో పూర్తి ఖచ్చితత్వం కోసం పోస్ట్ ప్రొడక్షన్‌కు కొన్ని నెలల సమయాన్ని కేటాయిస్తోంది. ప్రస్తుతం ముంబయ్‌లో జరుగుతున్న విఎఫ్‌ఎక్స్ పనులు నవంబర్ వరకు జరుగుతాయని… ఆతర్వాత డిసెంబర్‌లో సినిమా విడుదలవుతుందని తెలిసింది. మరి గ్రాఫిక్స్ ఆధారంగా రూపొందిన ‘అరుంధతి’తో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అనుష్క ‘భాగమతి’తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.