Home తాజా వార్తలు నిమజ్జనాలకు కట్టుదిట్టమైన భద్రత

నిమజ్జనాలకు కట్టుదిట్టమైన భద్రత

High Security for Ganesh immersion in Hyderabad

విధుల్లో 15వేల మంది సివిల్ పోలీసులు
ట్యాంక్‌బండ్‌పై 38క్రేన్లు ఏర్పాటు.
రంగంలోకి 2100 మంది పోలీసులు
సామాజిక మాధ్యమాల ద్వారా
ట్రాఫిక్ సమాచారం…

హైదరాబాద్ సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ లో ఆదివారం నిర్వహించనున్న గణేశ్ నిమజ్జన శోభా యాత్రకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్ల్లు పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. 15 వేలమంది పోలీసులు విధులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఓల్డ్ సిటీ నుండి వచ్చే ఊరేగింపు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు..బందోబస్తులో సిటీ పోలీసుతోపాటు లాఅండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్ పోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సిటీ ఆర్ముడ్ రిజర్వుడ్ బలగాలు అందుబాటులో ఉన్నాయి. భద్రతలో భాగంగా 16 బాంబు డిస్పోజల్ టీంలు 2 యాక్సెస్ కంట్రోల్ టీంలు ఏర్పాటు చేశారు. భద్రతలో 22 స్నిప్పర్ డాగ్స్ అందుబాటులో ఉన్నాయి. భాగంగా జనసంచారం గల ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు కొనసాగాయి. రైల్వే స్టేషన్, జంక్షన్‌లు, షాఫింగ్ మాల్స్, సినిమా హాల్స్, హోటల్స్, బస్ స్టేషన్‌లలో పోలీసు తనిఖీలు కొనసాగుతాయని వివరించారు.

605 అతి సున్నిత ప్రాంతాల గుర్తింపు…
310 అతిసున్నిత ప్రాంతాలను, 605 సున్నిత ప్రాంతాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. అందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వివరించారు. గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా 410 మొబైల్ పార్టీలను కూడా అందుబాటులో ఉన్నాయని పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఏడాది 10446 గణేష్ విగ్రహాలని ఏర్పాటు చేసేందుకు పోలీసు శాఖ నుండి అనుతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనధికారికంగా మరో 8 వేల పై చిలుకు విగ్రహాలు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. 2100 మంది ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో ఉండగా 14వేల మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా విధులు నిర్వహిస్తున్నారు, ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఇద్దరు డీసీపీ అధికారులు ఉంటారు. 4 అదనపు డీసీపీలు, 10మంది ఏసీపీలు, 32 మంది సిఐలు, వంద మంది ఎస్‌ఐ లు విధులు నిర్వహించునున్నారు.

ఖైరతాబాద్, బాలాపూర్ గణనాధులు ప్రత్యేకం…
ఖైరతాబాద్ గణనాథుని మధ్యాహ్నంలోపు నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 7గంటలకు పూజలు పూర్తి చేసిన అనంతరం ఊరేగింపు ప్రారంభించనున్నారు.మధ్యాహ్నం 1గంటవరకు సచివాలయం పక్కనే ఎన్టీఆర్ మార్గ్ వద్ద నాల్గోవ నెంబర్ క్రేన్ సహాయంతో నిమజ్జనం పూర్తి చేయనున్నారు. ఇక బాలాపూర్ నుండి ఊరేగింపుగా వచ్చే గణనాధుడి కోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ ను రూపొందించారు.బాలా పూర్ నుండి నల్లగొండ క్రాస్ రోడ్డుమీదుగా చార్మినార్, మదీనా, మొజాంజాహి మార్కెట్ ,సిద్దంబజార్, అబిట్స్, బషీర్ బాగ్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ కు చేరి నిమజ్జనం కార్యక్రమం పూర్తి కానుంది.

గ్రీన్, రెడ్, బ్లూ రూట్లు:  మండపాల నుండి ఊరేగింపుగా బయలుదేరు వినాయకుల నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్  వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా మూడు రూట్ మ్యాప్ లు అందుబాటులోకి తీసువచ్చినట్లు తెలిపారు. పెద్ద విగ్రహాలను నిమజ్జనం  చేసేందుకు వచ్చే వారికోసం ఎరుపు రంగు టూర్ ద్వారా పాత సచివాలయం నుండి ట్యాంక్ బంద్ కు చేరుతాయన్నారు.నీలం రంగు టూర్ ద్వారా చిన్న వినాయక విగ్రహాలను ట్యాంక్ మీదుకు సాగర్ లో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం చేసిన వాహనాలను తిరిగి పంపించేందుకు ఆకుపచ్చ టూర్ సహాయం తో తిరిగి వెల్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధనపు ట్రాఫిక్ కమీషనర్ అనీల్ కుమార్ స్పష్టం చేశారు.హైదరాబాద్ లో ట్రాఫిక్ ను 38 సెక్టార్ గా విభజించి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు,ఓల్డ్ సిటీ నుండి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకున్నారు.సాగర్ కు  నిమజ్జనం కోసం వచ్చే విగ్రాహాల కోసం 38 నిమజ్జ పాయింట్స్  అందుబాటులో ఉన్నాయని వివరించారు.38 క్రేన్ ల సహాయం తో  త్వరితగతిని నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు.

Telangana Breaking News