Friday, April 26, 2024

హై సెక్యూరిటి నెంబర్ ప్లేట్ రెండో సారి ఇవ్వడం సాధ్యం కాదు

- Advertisement -
- Advertisement -

High security number plate cannot be given second time

 

మనతెలంగాణ, హైదరాబాద్ : సుప్రీం కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సిందే. కొత్తగా వాహనాలు కోనుగులు చేసిన వారే కాకుండా 2013 తర్వాత రిజిస్ట్రేషన్ అయిన ప్రతి వాహనానికి హై సెక్యూరిటి నంబర్ ప్లేట్ ఫిట్ చేసుకోవాల్సిందే అని. రవాణా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేస్తుంటే. వాటిని తయారు చేసే నిర్వాహకులు మాత్రం ఒక సారి పాడై పోయిన, విరిగిపోయిన, రంగులు వెలిసి పోయిన హెచ్‌ఎస్‌ఆర్పి నంబర్ ప్లేట్లను మరో సారి తిరిగి ఇవ్వడం కుదరని, కావాలంటే వాటిని మరమ్మత్తు చేసి ఇస్తామని చెబుతున్నారు.

2013లో అత్యున్నత న్యాయస్థానమై సుప్రీం కోర్టు ప్రతి ఒక్క వాహనానికి హైసెక్యురిటి నెంబర్ ప్లేట్లు బిగించాల్సిందే అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నగరంలో ప్రతి రోజు 1000 నుంచి 1500 వాహనాలు రోడ్డు ఎక్కుతుంటాయి. పండగ సమయాల్లో వీటి సంఖ్య అధికంగానే ఉంటుంది. అయితే నిర్వాహకులు మాత్రమే 650 నుంచి 800 నెంబర్‌ప్లేట్లను మాత్రమే అందచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహన దారులకు రెండో సారి నెంబర్ పేట్లు జారీ చేయడం అసాధ్యంగా మారింది. దీంతో నెంబర్ ప్లేట్ల తయారీ దారులు రెండో సారి నెంబర్ ప్లేట్లు ఇవ్వడం సాధ్యం కాదని ఖరాఖండిగా చెప్పడంతో వారు నిబంధనలకు విరుద్దంగా సాధారణ నెంబర్ ప్లేట్లను తగిలించుకుని తిరుగుతున్నారు.

ఇప్పటి వరకు ఈ విషయంలో చూసి చూడనట్లు వ్యవహరించిన అధికారులు ప్రతి వాహన దారుడు ఖచ్చితంగా హైసెక్యూరిటి నెంబర్ ప్లేట్లు వాడాల్సిందే అని చెప్పడమే కాకుండా ట్రాఫిక్, రవాణాశాఖ అధికారులు హైసెక్యూరిటి నెంబర్ పేట్లు లేని వాహనాలు గుర్తించి వారికి ఫైన్ రూ. 500 నుంచి 1000 వరకు విధించేందుకు సిద్దం అవుతున్నారు. ఈ నేపథ్యంలో నేపథ్యంలో వాహన దారులు హైసెక్యూరిటి నంబర్ ప్లేట్ల కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఈ విధంగా వచ్చిన వారికి నిరాశే ఎదురవుతోంది. కొత్త వాహనం రిజిస్ట్రేషన్‌తో పాటే హెచ్‌ఎస్‌ఆర్పి ఫీజులు ఆటోమోబైల్ షో రూంల్లోనే వసూలు చేస్తున్నారు. ఇంత వరకు బానే ఉన్నా ఎన్నో భద్రత అంశాలతో కూడుకున్న నంబర్‌ప్లేట్లు పనికి రాకుండా పోయినా, గతంలో బిగించుకోక పోయినా రెండో సారి ఇచ్చేది లేదంటున్నానిర్వాహకులు.

కొత్త వాహనానికి ఒక్క సారి మాత్రమే జారీ చేస్తారని అడిగినప్పుడల్లా ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఒక వైపు రవాణా కార్యాలయాల్లో తగినన్న నంబర్ ప్లేట్లు లేక పొవడం, మరో వైపు అధికారులు హైసెక్యూరిటి నంబర్ పేట్లు లేక పోత ఫైన్ విధిస్తామని చెప్పడంతో వాహన దారులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా రవాణా శాఖ కార్యాలయాల్లో తగినన్ని నంబర్‌ప్లేట్లను సిద్దం చేసుకోవడమే కాకుండా, వాహన దారులు అడిగినప్పుడల్లా నంబర్ ప్లేట్లు జారీ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహన దారులు కోరుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News