Friday, April 19, 2024

ఎంసెట్ కన్వీనర్‌ ఎ.గోవర్ధన్

- Advertisement -
- Advertisement -

Higher Education Council

 

ఇసెట్‌కు మంజూర్ హుస్సేన్

హైదరాబాద్ : ఎంసెట్ కన్వీనర్‌గా జెఎన్‌టియుహెచ్ ఇంచార్జ్ రిజిస్ట్రార్, రెక్టార్ ఎ.గోవర్ధన్ నియమితులయ్యారు. ఉన్నత విద్యా మండలిలో కార్యాలయంలో సోమవారం జరిగిన సెట్స్ కమిటీ సమావేశంలో పలు ప్రవేశ పరీక్షల నిర్వహణకు సెట్స్ కన్వీనర్లను నియమించారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి సెట్ల కన్వీనర్ల జాబితాను ప్రకటించారు. ఇసెట్ కన్వీనర్‌గా జెఎన్‌టియుహెచ్ అడ్మిషన్స్ డైరెక్టర్‌గా ఉన్న ఎం.మంజూర్ హుస్సేన్ నియమితులు కాగా, పిఇసెట్ కన్వీనర్‌గా మహాత్మాగాంధీ వర్సిటీకి చెందిన వి.సత్యనారాయణను నియమించారు. అలాగే ఐసెట్ కన్వీనర్‌గా కాకతీయ వర్సిటీకి చెందిన కె.రాజిరెడ్డి, లాసెట్, పిజిఎల్‌సెట్ కన్వీనర్‌గా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన జి.బి.రెడ్డి, పిజిఇసెట్ కన్వీనర్‌గా ఒయుకు చెందిన ఎం.కుమార్, ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ఒయుకు చెందిన టి.మృణాళిని నియమితులయ్యారు.

మూడు సెట్లకు మారిన కన్వీనర్లు
ఎంసెట్, ఇసెట్ ప్రవేశ పరీక్షలను జెఎన్‌టియుహెచ్ నిర్వహిస్తుండగా, ఈ రెండు సెట్లకు కొత్త కన్వీనర్లు వచ్చారు. అలాగే ఐసెట్‌ను కాకతీయ వర్సిటీ నిర్వహిస్తుండగా దానికి కూడా కొత్త కన్వీనర్‌ను నియమితులయ్యారు. ఈ సారి ఎంసెట్, ఇసెట్, ఐసెట్‌లకు ఈ సారి కొత్త కన్వీనర్లను నియమించారు. గత ఏడాది వరకు ఎంసెట్ కన్వీనర్‌గా యాదయ్య కొనసాగగా, ఆయన స్థానంలో గత ఏడాది వరకు ఇసెట్ కన్వీనర్‌గా ఉన్న గోవర్ధన్ నియమితులయ్యారు. అలాగే ఇసెట్ కన్వీనర్‌గా ఉన్న గోవర్ధన్‌కు ఎంసెట్ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో ఇసెట్ కన్వీనర్ బాధ్యతలను ఎం.మంజూర్ హుస్సేన్‌కు అప్పగించారు. ఐసెట్ కన్వీనర్‌గా గత ఏడాది సిహెచ్ రాజేశం కన్వీనర్‌గా ఉండగా, ఈ సారి ఆయన స్థానంలో కె.రాజిరెడ్డిని నియమించారు. మిగతా సెట్లను గత ఏడాది ఉన్న కన్వీనర్లే కొనసాంచారు.

23న కన్వీనర్ల సమావేశం
ప్రవేశ పరీక్షల నిర్వహణకు కన్వీనర్లను నియమించిన నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన ఆయా సెట్ల కన్వీనర్లతో ఉన్నత విద్యామండలి సమావేశం నిర్వహించనుంది. ఆ సమావేశంలో సెట్ కమిటీల ఏర్పాటుపై చర్చించనున్నారు. ఆ తర్వాత సెట్ నోటిఫికేషన్లలో ఉండాల్సిన విధివిధానాలను ఆయా సెట్ కమిటీలు ఖరారు చేయనున్నాయి. ఫిబ్రవరిలో సెట్ కమిటీలు సెట్స్ నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.

మే లో పరీక్షలు
ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్షలు మే 5 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 5,6,7 తేదీలలో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు, మే 9, 11 తేదీలలో అగ్రికల్చర్ స్ట్రీమ్‌ను ఆన్‌లైన్ పరీక్షలు జరుగనున్నాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున ఆన్‌లైన్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు రెండవ సెషన్ ఉంటుంది. అన్ని ప్రవేశ పరీక్షలు మే నెలలోనే పూర్తి కానున్నాయని చెప్పారు. మే 2న ఇసెట్ ప్రారంభం కానుండగా, మే 30న ముగిసే పిజిఇసెట్‌తో ప్రవేశ పరీక్షలు పూర్తి అవుతాయి.

మే 13వ తేదీన పిఇసెట్, మే 23న ఎడ్‌సెట్, మే 20న ఐసెట్, మే 25న లాసెట్, పిజిఎల్‌ఎట్, మే 27 నుంచి 30 వరకు పిజిఇసెట్ పరీక్షలు జరుగనున్నాయి. ప్రవేశ పరీక్షలన్నీ మే నెలలో పూర్తి కానున్న నేపథ్యంలో జూన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎఐసిటిఇ నిబంధనల ప్రకారం జూన్ 30లోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేసి, జూలై 1 నుంచి వచ్చే విద్యాసంవత్సానికి సంబంధించిన తరగతులు ప్రారంభం కావాలి. ఈ మేరకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించారు.

Higher Education Council appointed by conveners of sets
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News