Home రాష్ట్ర వార్తలు చదువులు ఉన్నతం,,, మార్కులు అథమం

చదువులు ఉన్నతం,,, మార్కులు అథమం

ఎస్‌ఐ భర్తీలో విడ్డూరం
అర్హత సాధించని వారిలో 90 శాతం
ఉన్నత విద్యావంతులే 

తుది పరీక్షల్లో ఎంతమందో?

ఎస్‌ఐ పోస్టుల అర్హత పరీక్షల్లో మొత్తం మీద అన్ని కేటగిరీలు కలుపుకుని 88875 మంది విజయం సాధించగా మరో వారం పది రోజుల్లో వీరికి దేహదారుడ్య పరీక్షలు నిర్వహించను న్నారు. అనంతరం క్రీడాంశాల పోటీలు, అందులో ఉత్తీర్ణు లైన వారికి వచ్చే ఆగస్టులో తుది రాత పరీక్షలు వుంటాయి. ఈ పరీక్షలు మరింత కఠినంగా వుండే అవకాశాలున్నాయి. ఈ పరీక్షలకు కనీసం 45 వేల మంది అభ్యర్థులు ఎంపికయ్యే వీలుందని రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఇందులో ఎంత మంది విజయం సాధిస్తారో….? చూడాల్సి వుంది.

telangana-policeమన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో బోగస్ డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలు వున్నాయని, వీటివల్ల విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నామని, ఆ కళాశాలల్లో చచ్చుబండల చదువులు ఉంటున్నాయని సిఎం కెసిఆర్ అన్నమాట అక్షరాల నిజమని తేలింది. రాష్ట్రంలో ఉన్న అనేక కాలేజీలు విద్యార్థులకు కనీస బోధన కూడా నేర్పడం లేదని, నామ్‌కే వాస్తే చదువులతో సరిపుచ్చుతూ అత్తెసరు మార్కులతో డిగ్రీలు, పిజిలు ఇస్తూ చేతులు దులుపు కుంటున్నాయని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఎస్‌ఐ పోస్టుల కోసం నిర్వహించిన అర్హత పరీక్షలు తేటతెల్లం చేసింది. ఎస్‌ఐ పోస్టులకు ఇటీవల జరిగిన అర్హత పరీక్ష ల్లో లక్షా 85 వేల మందికి పైగా పాల్గొనగా ఇందులో లక్షా 78 వేల మంది డిగ్రీ, పిజిలు, బిటెక్, ఎంటెక్, ఎంఫిల్, పిహెచ్‌డిలు చదివిన వారున్నారు. అందులో కేవలం 88875 మంది మాత్రమే అర్హత ప్రమాణాల మార్కులను అధిగ మించగలిగారు. ఎస్‌ఐ పోస్టులకు నిర్వహించిన అర్హత పరీక్షల్లో విజయం సాధించేందుకు ఒసి అభ్యర్థులు 40 శాతం, బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు ఐదు శాతం తక్కువగా మార్కులు సాధించాల్సి ఉంది. ఈ అర్హత పరీక్షల్లో 90 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధి స్తారని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు భావిం చగా, కేవలం 50 శాతం మాత్రమే విజయం సాధిం చారు. ఇక ఉత్తీర్ణత సాధించిన వారిలో చాలా మంది కనీస మార్కులకే పరిమితం కాగా అంతకన్నా కొన్ని ఎక్కువ మార్కులు సాధించగలిగారు. పది వేల మంది మాత్రమే 60 నుంచి 70 శాతానికి పైగా మార్కులు సాధించడం విశేషం. ఇక అర మార్కు నుంచి రెండు మార్కుల తేడాతో ఉత్తీర్ణత సాధించని వారు 30 వేల మందికి పైగా వుండడం గమనార్హం. ఇదే సమ యంలో 25 అంతకు తక్కువగా మార్కులు సాధించిన వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇక డిగ్రీల వారీగా దర ఖాస్తు చేసుకున్న వారు, అందులో ఉత్తీర్ణత సాధించిన వారి వివరాలు పరిశీలిస్తే బిఎ చదివిన వారు 24584 మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 8665 మంది మాత్రమే విజయం సాధించారు. బికాం చదివిన వారు 33002 మంది దరఖాస్తు చేసుకోగా 10940 మంది, బిఫార్మసీ వారు 2996 మంది దరఖాస్తు చేసుకోగా, 1635 మంది, బిఎస్‌సి 39683 మంది దరఖాస్తు చేసు కోగా, 21098 మంది, బిఎ స్‌సి(వ్యవసాయం) చదివిన వారు 124 మంది దరఖాస్తు చేసుకోగా 63 మంది విజయం సాధించారు. ఇక బిటెక్ చదివినవారు అత్యధి కంగా 42992 మంది దరఖాస్తు చేసుకోగా, 23526 మంది ఉత్తీర్ణత సాధించారు. బిబిఎం చదివిన వారు 294 మంది దరఖాస్తు చేసు కుంటే 84 మంది, బిసిఎ చదివిన వారు 177 మంది దరఖాస్తు చేసుకోగా, 64 మంది, ఎంఎ చది విన వారు 3639 మంది దరఖాస్తు చేసు కోగా 1961 మంది, ఎంకాం చదివిన వారు 1919 మంది దరఖాస్తు చేసు కోగా 1073 మంది, ఎం.ఫార్మసి చదివిన వారు 1039 మంది దరఖాస్తు చేసుకోగా, 679, ఎంఫిల్ చదివిన వారు 41 మంది దరఖాస్తు చేసుకుంటే 20 మంది మాత్రమే ఉత్తీర్ణత మార్కులను అధిగమించ గలిగారు. ఎంఎస్‌సి చదివిన వారు 7036 మంది దరఖాస్తు చేసు కోగా, 4733 మంది, ఎంటెక్ చదివిన వారు 3658 మంది దరఖాస్తు చేసుకోగా, 2335 మంది, ఎంబిఎ చదివిన వారు 12674 మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 5498 మంది మాత్రమే విజయం సాధించారు. ఇక ఎంసిఎ చదివిన వారు 3396 మంది దరఖాస్తు చేసుకోగా 2322 మంది, పిహెచ్‌డి చదివిన వారు 23 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 12 మంది, ఇంటర్ చదివిన వారు 7704 మంది దరఖాస్తు చేసు కోగా, 802 మంది ఉత్తీర్ణత మార్కులు సాధించ గలిగారు. మొత్తం మీద ఎస్‌ఐ పోస్టులకు నిర్వహించిన అర్హత పరీక్ష డిగ్రీలు, పిజిలు, అంతకు పై చదువులు చదివిన వారి సత్తా ఏ పాటిదో తేటతెల్లం చేసింది.